ఫీడులు:
టపాలు
వ్యాఖ్యలు

లోకం బంగారం గా మారడానికి పడే మధన చూపించకుండా , కంగారు కంగారు గా convocation ఇచ్చేశారు
 
మిక్కి మేయర్ నేపధ్య సంగీథం బాగుంది
సిరివెన్నెల సాహిత్యం చాలా బాగుంది. ప్రత్యేకం గా నాకు ఆఖరి పాట బగా నచ్చింది
చోట కే నాయుడు చమేర పని తనం బాగుంది
పాటలని చాలా బాగా చిత్రీకరించారు

ఇక కధ విషయానికి వస్తే………..అసలు దర్శకుడు చెప్పదలచుకున్నది ఆఖరునే తెలిసింది నాకు
అసలు కథని ఎవరి perspective  లో చెప్పదలచుకున్నారో  స్పష్టం గా లేదు
climax వరకు hero, heroine గురించే కథని సాగదీశారు
ఆఖరున ప్రకాష్ రాజ్ ని చంపేసి, హడావుడి గా హీరో కి ఙ్ఞానోదయం కలిగించి,  ఒక్క పాటలో నాలుగేళ్ళ ఇంజనీరింగు పూర్తి చేసేసి, టాపర్ ని చేసేసారు
 
చెప్పదలచుకున్నది పెద్ద వాళ్ళ దృక్పథం నుంచీ అయితే, మొదటి నుంచీ( లెక్చరరు ద్వరా  )
ఆకర్షణ , ప్రేమ కి ఉన్న బేధాన్ని నిజ జీవితపు ఉదాహరణలతో చెప్పుండచ్చు
ఆ వయసుల లో  ఈ ఆకర్షణలు ఎలా చదువుని మీద ధ్యాసను  తగ్గిస్తాయో  చెప్పుండచ్చు
మనసు కు కాపలా అన్నది ఎందుకు అవసరమో చెప్పుండచ్చు
 
ఆఖరున పెద్దలు, పిన్నలు ఇద్దరు కోరుకునేది ఆనందమే అని చెప్పారు.

హీరో లో మార్పు అన్నది పరిస్థితుల వల్ల వచ్చినా , అది శాశ్వతం కాదు, మార్పు అనేది అనుభవాల సారం గా, ఒక realisation గా చెప్పి ఉండాలి

హీరోయిన్ పాత్రధారి తల్లిదండ్రులకు దూరం గా నాలుగేళ్ళు ఉన్న కాలాన్ని స్పృశించలేదు అసలు. ఆ కాలాన్ని చెప్పి ఉంటే యువతకు మార్గదర్శకం గా ఉండేది
 
చాలా మటుకు సినిమాను క్లీన్ గా చూపించారు
కానీ……..ఈ మధ్య ప్రతి సినిమాలో పురుషుడి మర్మాంగం పై కొట్టడం హాస్య కేళి గా చూపించడం మామూలు అయ్యింది. ఈ చిత్రం కూడా అందుకు అతీతం కాలేక పోయింది
 లెక్చరర్లను మర్యాద ఇవ్వక పోయిన, అమర్యాద ఇవ్వలేదు

PS  హీరొ వాళ్ళు చదివినది BiPC కాని సీట్ మాత్రం వచ్చింది ఇంజనీరింగు లో

ఇంటరు హాస్టళ్ళు అమ్మాయిలకు, అబ్బాయిలకు  దగ్గరగా ఉండవు కదా!

లెక్చరు పాత్రధారీ ఎప్పుడూ స్టేషన్ లోనే ఉంటాడా అన్న అనుమానం వచ్చింది

వీక్షకుల అదృష్టం ఏంటి అంటే ఈ సినిమా తేజ వంటి దర్శకుల చేతిలో పడలేదు, పడి ఉంటే ఆఖరున హీరో, హీరోయిన్ చేత పాల వ్యాపారం పెట్టించే వారు

Follow

Get every new post delivered to your Inbox.